సుకుమార్ రైటింగ్స్‌లో..

అఆ తరువాత హీరో నితిన్ ఆ స్థాయి విజయాన్ని అందుకుని చాలా రోజులవుతోంది. ప్రస్తుతం ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించిన ఆయన తాజాగా మరో చిత్రానికి సై అన్నట్లు తెలిసింది. కుమారి 21ఎఫ్ సినిమాతో సుకుమార్ రైటింగ్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించిన దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూనే గీతా ఆర్ట్స్-2 బన్నీవాసుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సరికొత్త నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తారు.