ప్రయాణంలో పాదరక్షలు

ఏ పనిచేస్తున్నప్పుడు ఆ పనిని బట్టి మనం ధరించే దుస్తులు అయినా, వేసుకునే చెప్పులైనా ఆ పనిమీద ప్రభావం చూపుతాయి. అలాగే ప్రయాణంలో పాదరక్షల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణం చేస్తున్నప్పుడు పాదరక్షల విషయంలో ఈ చిట్కాలు పాటిస్తే మీ పాదాలు సురక్షితం.

ట్రెక్కింగ్ చేసేటప్పుడు బూట్లు తప్పనిసరిగా వేసుకోవాలి. ఎందుకంటే మనం వేసే అడుగులు బలంగా వేయాలి. బూట్లు కాకుండా ఏం ఉన్నా రాళ్లు, ముళ్లు గుచ్చుకొని గాయాల పాలవ్వాల్సి వస్తుంది. అలా అని బరువైన బూట్లు వేసుకుంటే మనిషి బరువుతో పాటు బూట్ల బరువును కూడా మనం మోయాల్సివస్తుంది. దానివల్ల త్వరగా అలసిపోవాల్సి వస్తుంది. అలసట వల్ల ప్రయాణం సాఫీగా జరుగకపోవచ్చు. ప్రయాణం చేయాల్సి వస్తుందని ముందే తెలిసినప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం తిరుగాల్సిన ప్రదేశాలు, చూడాల్సిన ప్రాంతాలను బట్టి చెప్పులు అవసరమవుతాయా? బూట్లు అవసరమవుతాయా? ఇంకేమైనా అవసరం అవుతాయా అని ముందే తెలుసుకొని అంచనా వేసుకోగలిగితే కొంతవరకు కష్టాలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రయాణాల్లో తేలికటి బూట్లు వేసుకుని స్లిప్పర్లు వెంటపెట్టుకుంటే సౌకర్యంగా ఉంటుంది. ఆన్‌లైన్ సైట్‌లలో, స్టోర్‌లలో ట్రావెల్ షూస్, చప్పల్స్ అందుబాటు ఉంటాయి. ప్రయాణాలు చేసేవాళ్లు ఫ్యాన్సీ చెప్పులు వేసుకోకపోవడం ఉత్తమం. సముద్రాలు, నదులు, సరస్సులను చూడడానికి వెళ్లేటప్పుడు బూట్లు వేసుకోకపోవడమే మంచిది.

Related Stories: