ప్రమాదకర చాలెంజ్!

గ్రీన్ చాలెంజ్ భారీ ఎత్తున్న నడుస్తున్నది. సినిమా తారలు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు ఈ గ్రీన్ చాలెంజ్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇంకో చాలెంజ్ ప్రారంభమయింది. అదే కికి చాలెంజ్. వివాదాలు కూడా దీన్ని వెంటాడుతున్నాయి. ఏంటి? ఎందుకు?

ఈ మధ్య కాలంలో చాలెంజ్‌లు ఉద్యమంలా మారా యి. దాదాపు అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి. తాజాగా వచ్చిన కికి చాలెంజ్ మాత్రం నెగెటివ్ ప్రభావం చూపుతున్నది. ప్రముఖ హాలీవుడ్ సింగర్ డ్రేక్ పాడిన ఇన్ మై ఫీలింగ్ పాట విపరీతంగా పాపులర్ అయింది. ఆ పాటను హాలీవుడ్ నటుడు షిగ్గి చాలెంజ్‌లా మార్చాడు. అదే కికి చాలెంజ్. దీన్ని చాలామంది ఫాలో అవుతున్నారు. కదులుతున్న కారు నుంచి కిందికి దిగి కారు నిదానంగా ముందుకు పోతుంటే దానితో పాటు డాన్స్ చేసి మళ్లీ కారులో కూర్చోవాలి. ఇదే కికి చాలెంజ్. ఈ చాలెంజ్ కొంత వివాదం కూడా అవుతున్నది. పోలీసులు దీన్ని వ్యతిరేకించి చేయకూడదని హెచ్చరికలు జారీ చేశారు. అయినా కికి చాలెంజ్‌ను స్వీకరించేవాళ్ల సంఖ్య పెరుగుతున్నది. సోషల్‌మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అదా శర్మ ముందు ఈ చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు రెజీనా కూడా ఈ చాలెంజ్‌లో పాల్గొని ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేసింది. ఇలాంటి చాలెంజ్‌ల వల్ల ప్రమాదాలు జరుగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగాయని కొందరు, సరదా కోసమే అని ఇంకొందరు. ఇలా సోషల్‌మీడియాలో దీని మీద రకరకాల అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.