పాస్‌వర్డ్ పదిలమేనా?

ఈ మధ్య పాస్‌వర్డ్‌లు దొంగిలించి వెబ్‌సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ చేయడం విపరీతంగా పెరిగిపోయింది. మరి మీరు పెట్టుకున్న పాస్‌వర్డ్‌లు పదిలంగానే ఉన్నాయా? ఎవరైనా హ్యాక్ చేశారా తెలుసుకోవాలంటే ఇలా చేయండి.

-గూగుల్ సెర్చ్‌బాక్స్‌లో Troy Hunt Have Been Pwned అని టైప్ చేయండి. పాస్‌వర్డ్‌లకు సంబంధించిన ఒక వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.

-అందులో మీ మెయిల్ ఐడీని టైప్ చేసి Pwned అనే ఆప్షన్ మీద నొక్కండి. మీ పాస్‌వర్డ్ హ్యాక్ అయిందా? లేదా ? తెలుస్తుంది. ఒకవేళ మీ పాస్‌వర్డ్ ఎవరూ దొంగిలించకపోతే గుడ్‌న్యూస్ అని గ్రీన్‌కలర్‌లో ఒక విండో ఓపెన్ అవుతుంది.ఎవరైనా మీ పాస్‌వర్డ్ దొంగిలిస్తే ఓ నో Pwned అని బ్రౌన్ కలర్‌లో ఒక విండో ఓపెన్ అవుతుంది.

-ఒకవేళ ఎవరైనా మీ పాస్‌వర్డ్ దొంగిలిస్తే మీ అకౌంట్ పూర్తిగా వారి ఆధీనంలోకి వెళ్లకముందే సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీ కొత్త పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోండి.

-పాస్‌వర్డ్ మార్చుకోనవసరం లేకుండా అదే పాస్‌వర్డ్‌ను మరింత సెక్యూరిటీగా ఉంచుకునేందుకు మరో ఆప్షన్ కూడా ఉంది. లాస్ట్‌పాస్ అనే సైటుకి వెళ్లి అందులో మోర్ ఆప్షన్స్ ఓపెన్ చేసి సెక్యూరిటీ చాలెంజ్ అనే ఆప్షన్స్ ఎంచుకోవాలి.అక్కడ మీకు పాస్‌వర్డ్‌లకు సంబంధించిన డేటా బేస్ కనిపిస్తుంది. అందులో మీ పాస్‌వర్డ్‌ను ఎవరైనా దొంగిలించేందుకు ప్రయత్నిస్తే మీకు ఈమెయిల్ వచ్చేలా సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు.

-మీరు ఎప్పుడు పాస్‌వర్డ్ క్రియేట్ చేశారు? ఎప్పుడు మార్చుకున్నారు? అని కూడా కనిపిస్తుంది. మీ పాస్‌వర్డ్ బలంగా ఉందా? బలహీనంగా ఉందా? ఇంకా ఏం కలిపితే మీ పాస్‌వర్డ్ బలంగా ఉంటుందనేది కూడా మీకు ఇక్కడ సలహాలు ఉంటాయి. వాటిని ఫాలో అయి మీ పాస్‌వర్డ్ మరింత బలంగా సెట్ చేసుకోవచ్చు.

Related Stories: