పనితనం

మట్టి పనితనం అద్భుతం. వ్యవసాయం చేసే రైతన్నలకు తెలిసినంతగా దీని విలువ మరొకరికి తెలియకపోవచ్చు. ఇందులోని ఖనిజాలు, సేంద్రియ పదార్థాలు వృక్ష జీవజాతులకు కావలసినంత శక్తినిస్తాయి. మనం ఈ భూమిమీద నివసిస్తున్నామంటే ఈ మట్టివల్లే. భవనాలు దీనిపైనే నిర్మితమవుతున్నాయి. భూమ్మీది మొత్తం పర్యావరణ వ్యవస్థలోనే ఇది అత్యంత ప్రధానమైంది. అనేక రకాలుగా ఇది తన సేవలను అందిస్తున్నది. ఎన్నో సూక్ష్మజీవులకు ఇది ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది. ఇంతేనా, భూమిలోని నీటిని మట్టే శుద్ధి చేస్తుంది. వివిధ పోషకాలను పునర్వినియోగం (రీసైక్లింగ్)గా మారుస్తుంది. వాతావరణానికి కావలసిన వాయువుల తయారీలోనూ మట్టి తన వంతు పాత్రను పోషిస్తుంది.