పద్యనీతి

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రుస్తులై ఆరంభించి బరిత్యజింతుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్ననిహస్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థమున లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్‌॥ -ఏనుగు లక్ష్మణ కవి, (భర్తృహరి నీతి శతకం)

కష్టాలకు భయపడి ఏ కార్యాన్నీ మొదలుపెట్టరు అల్పులైన మానవులు. కార్యాల్ని మొదలు పెట్టిన తర్వాత ఏవైనా విఘ్నాలు కలిగితే భయపడి వెంటనే వాటిని వదిలిపెట్టే వారు మధ్యములు. కానీ, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, మరెంత కష్టమొచ్చినా, ధైర్యసాహసాలతో ఎన్ని ప్రయత్నాలైనా చేసి మొదలుపెట్టిన కార్యాల్ని విడవకుండా పూర్తి చేసే వారు ధీరులు, తెలివైన వారుగా అభివర్ణించిన అద్భుత పద్యమిది.