పద్యనీతి

ఇందు గల డందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెం దెందు వెదకి చూచిన నం దందే గలడు దానవాగ్రణి వింటే.(స.స్క.)

-శ్రీమదాంధ్ర మహాభాగవతం

ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుని ఉద్దేశించి చెప్పిన పద్యమిది. శ్రీ మహావిష్ణువు (శ్రీహరి) అంతటా ఉంటాడన్నపుడు, ఈ స్తంభంలో కూడానా? అంటే అవునంటాడు ప్రహ్లాదుడు. దానిని బద్దలు కొట్టగా.. ఉగ్రనారసింహస్వామి రూపంలో ప్రత్యక్షమవుతాడు. నిజానికి దేవుడు లేనిదెక్కడ? ఇక్కడ, అక్కడ, ఎక్కడ వెతికినా ఉంటాడు. మనకా సందేహమే అక్కర్లేదు అన్న ఇందులోని నీతి ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతానికి అసలు భూమిక.