పద్దెనిమిది తర్వాతే!

ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలుసు. సిగరెట్ పెట్టెల మీద ఆరోగ్యం పాడవుతుందని బొమ్మలు కూడా ఉంటాయి. అయినా ఆ అలవాటును మాత్రం మానడం లేదు. ఓ అధ్యయనంలో వెల్లడయిన కొన్ని ఆసక్తికరమైన అంశాలివి.

యువకులు పద్దెనమిది సంవత్సరాలు దాటిన తర్వాతే ధూమపానం చేయడానికి ఆసక్తి చూపుతున్నారని ఈ అధ్యయనం ద్వారా వెల్లడయింది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్ నిర్వహించిన ఈ అధ్యయనంలో పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్లు.. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్లు, అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్లు పాల్గొన్నారు. ఎక్కువ శాతం పద్దెనమిది సంవత్సరాలు నిండిన తర్వాత ధూమపానం చేయడానికి ఇష్టపడుతున్నారని తేలింది. ఇప్పుడు సిగరెట్ల కన్నా ఎక్కువ ఈ సిగరెట్స్, హుక్కా,వేపర్ వంటి వస్తువులను వాడి పొగను తీసుకుంటున్నారు. ఈ వయసులోని మద్యపానం, డేటింగ్, డ్రైవింగ్ వంటి అంశాల పట్ల ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని చెప్తున్నారు. ప్రతి ఏడాది ధూమపానం చేసే యువకుల సంఖ్య పెరుగుతూనే వస్తుందని అధ్యయనకారులు పేర్కొన్నారు.

Related Stories: