పచ్చిమిర్చి మంచి ఔషధం!

పచ్చి మిరపకాయ అనగానే కేవలం కూరలకు, పచ్చళ్లకు, బజ్జీలకు, సలాడ్‌లకు మాత్రమే ఉపయోగిస్తుంటారు. అయితే, వీటి ప్రత్యేక తెలిస్తే మాత్రం.. వాటిని రోజూ వాడకుండా ఉండలేరు. ఎందుకంటే, పచ్చి మిరపకాయలో శరీరానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.

మనసుకు చాలా ఉత్తేజాన్ని కలిగించడంలో పచ్చిమిర్చి చాలా బెటర్ అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో జీరో కేలరీలు, రసాయనాలు జీవక్రియలను 50శాతం వేగం చేస్తాయి. అంతేకాదు, క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించే యాంటీ ఆక్సిడెంట్లు మిర్చిలో ఉంటాయి. ప్రీరాడికల్స్‌ను ఎప్పటికప్పుడు బయటకు పంపించేయడంతోపాటు, ప్రొస్టేటు గ్రంథి సమస్యలకు కూడా మిర్చితో మంచి పరిష్కారం లభిస్తున్నది. గుండె జబ్బులకు దారితీయకుండా ఎంతగానో మేలు చేస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే రక్తం గడ్డ కట్టేందుకు తోడ్పడే విటమిన్ కె ఇందులో పుష్కలంగా లభిస్తుంది. చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను పెంచి చలి నుంచి రక్షిస్తుంది. జలుబు, సైనస్ వంటి సమస్యలకు కూడా మంచి పరిష్కార మార్గమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముక్కులోపలి మ్యూకస్ మెంబ్రేన్లను మిర్చి ఉత్తేజపరుస్తుంది. మిర్చీలో ఉండే క్యాప్సేసియన్ వల్ల రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. బీటా, కెరోటిన్, విటమిన్ సి మిరపకాయలో ఉండడం వల్ల కంటికి, చర్మానికి, ముఖ్యంగా రోగ నిరోధక శక్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది. డయాబెటిస్ బాధితులకు, ఐరన్ లోపం ఉన్న వారికి పచ్చిమిర్చి మంచి ఔషధం.

Related Stories: