పచ్చబొట్టేసినా!

నచ్చినవారి మీద ప్రేమను తెలియచేయడానికి.. ఆ పేరును పచ్చబొట్టుగా పొడిపించుకోవడం అనాదిగా వస్తున్నది.. అదే పని సెలెబ్రిటీలు చేస్తే కాస్త స్పెషల్‌గా ఉంటుంది! పేర్లతో పాటు.. వివిధ సింబల్స్‌తో పచ్చబొట్టేయిస్తున్నారు.. వాటి అర్థాలు తెలుసుకోవాలంటే డిక్షనరీలు వెతుకాల్సిందే! అంత శ్రమ లేకుండా ఇక్కడ ప్రముఖ సెలెబ్రిటీలు.. వారి టాటూల వెనుక కథలు.. అర్థాలు తెలియచేస్తున్నాం..

నాగచైతన్య- సమంత..

చాలా యేండ్లు ప్రేమించుకొని.. ఒక్కటైన, చక్కనైన జంట. టాలీవుడ్‌లో ఇప్పుడు క్యూటెస్ట్ కపుల్‌గా వీరికి పేరు. అయితే పెండ్లికి ముందు వీరి చేతి మీద టాటూ అందరి దృష్టినీ ఆకర్షించింది. పెండ్లి అయ్యాక ఆ టాటూ అర్థమేంటో చెప్పారు ఈ దంపతులు. అదొక రోమన్ సింబల్. దీనికి అర్థం.. మన రియాలిటీని మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే.. ఊహాల్లో బతుకకూడదనే గూడార్థం అందులో ఉంది.

శ్రుతిహాసన్

శ్రుతిహాసన్‌కి టాటూలపై మక్కువ ఎక్కువే. కెరీర్ తొలినాళ్లలో ఉన్నప్పుడు.. ఆమె మొదటి టాటూ వేయించుకున్నది. ఎడమ భుజం మీద తన పేరును తమిళంలో రాయించుకున్నది. ఆమెకు మ్యూజిక్ అంటే కూడా ఇష్టమన్న సంగతి తెలుసు కదా! అందుకే.. చెవి వెనుక భాగంలో మ్యూజిక్ సింబల్ పచ్చబొట్టు వేయించుకుంది. ఈ మధ్యే చేతి మణికట్టు మీద రోజా పువ్వు టాటూ పొడిపించుకుంది.

సుస్మితాసేన్..

ఒకప్పటి మిస్ యూనివర్స్ సుస్మితాసేన్. నటిగా.. మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి ఆమె జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ఇక ఈమె.. లాటిన్‌లోని ఒక ఫిలాసఫీ కోట్‌ని చేతి మీద పచ్చబొట్టు వేయించుకుంది. ఆట్ వియామ్ ఇనివినమ్ ఆట్ ఫెసియం అని ఉంది. నేను ఒక మార్గాన్ని కనుగొంటాను. లేదా ఒక మార్గాన్ని ఏర్పరుస్తానుఅని దానర్థం.

విరాట్ కోహ్లీ..

ఇండియన్ టీమ్ కెప్టెన్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు కోహ్లీ. విరాట్ ఏది చేసినా క్రేజీగా ఉంటుంది. అభిమానులు కూడా విరాట్ ైస్టెల్స్‌ని తెగ ఫాలో అవుతుంటారు. ఈ క్రికెటర్ ఎడమ చేతి భుజం నుంచి మణికట్టు వరకు దాదాపు 8 టాటూలు ఉంటాయి. అందులో గోల్డెన్ డ్రాగన్, సమురాయ్ వారియర్‌లు కూడా కనిపిస్తాయి. స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ, స్వయంశక్తి ఏంటో తెలిపేవే ఈ టాటూలు.

రణ్‌బీర్‌కపూర్

బాలీవుడ్‌లో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. సంజూ సినిమాతో స్టార్‌డమ్ మరింత పెరిగింది రణ్‌బీర్‌కి. ఇతడు కపూర్ ఫ్యామిలీకి చెందిన వాడు. ఇతడి మణికట్టు మీద ఆవారా అని రాసి ఉంటుంది. అంటే.. ఎలాంటి పట్టింపులు లేని మనిషి అని అర్థం. అలాగే తన తాత నటించిన ఆవారా సినిమా తనకు చాలా ఇష్టమని అందుకే ఈ టాటూ వేయించినట్లు ప్రకటించాడు.

కంగనా రనౌత్

తెలుగు తెర మీద కనిపించింది ఒకటే సినిమా అయినా తనదైన ముద్ర వేసిం ది కంగనా. త్వరలో మణికర్ణికగా మెరిసిపోవడానికి సన్నద్ధమవుతున్నది. టాటూ గనక వేస్తే అది యూనిక్‌గా ఉండాలనుకునే రకం ఈమె. అందుకే మెడ వెనుక భాగంలో వారియర్‌ఏంజెల్‌ని టాటూ గా వేయించుకుంది. తను ఇండస్ట్రీలో, పర్సనల్‌గా ఒంటరి పోరు చేస్తున్నానని చెప్పేలా ఈ సింబల్ ఉన్నది.

అల్లు అర్జున్ భార్య స్నేహ పేరు, నాని వాళ్ల ఫ్యామిలీ పేర్లు కలిసేలా టాటూ వేయించుకున్నాడు. నాగార్జున శివమణి సినిమా కోసం టాటూ వేయించుకోవాల్సి వచ్చింది. వీళ్లు కాకుండా రోజా, అనసూయ, త్రిషలు టాటూ వేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రియమణి, ప్రియాంకచోప్రా కూడా డాడీస్ గర్ల్ అని పచ్చబొట్టు పొడిపించుకున్నారు. వీళ్లే కాకుండా ఈ లిస్టులో చాలామంది ఉన్నారు.