పగలు లాయర్లు.. రాత్రుళ్లు డ్రాగ్ డాన్సర్లు

మగవాళ్లే ఆడవాళ్లలా దుస్తులు, మేకప్ వేసుకొని ప్రదర్శనలు చేయడాన్ని డ్రాగ్ డాన్సింగ్ అంటారు. ఈ డ్రాగ్ ప్రదర్శన ద్వారా వారిలోని భావాలను స్వేచ్ఛగా చెప్పడం దీని ప్రత్యేకత. సాధారణంగా ఇది ఎవరో సామాన్యులు చేస్తే ఇంత ప్రచారం ఉండదేమో.. ఢిల్లీకి చెందిన మానవ హక్కుల విభాగానికి చెందిన ఇద్దరు న్యాయవాదులు డ్రాగ్ డ్యాన్సర్లుగా మారడంతో ఈ పేరు అందరి నోటా వినిపిస్తున్నది.

ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్‌కు చెందిన ఇద్దరు లాయర్లు ఇక్ష, ఆయుష్మాన్‌లు కలిసి మనిషి స్వేచ్ఛగా జీవించే హక్కును ప్రజలకు తెలియజేయాలని డ్రాగ్ డ్యాన్సర్లుగా మారారు. పగలు లాయర్లుగా, రాత్రిళ్లు క్లబ్బు, పబ్బుల్లో డ్రాగ్ డ్యాన్సర్లుగా తమకు నచ్చిన విధంగా ఉంటున్నారు. ఇలా చేయడం వల్ల తమలోని స్త్రీ లక్షణాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే అవకాశం దక్కిందని అంటున్నారు ఇక్ష, ఆయుష్మాన్. అయితే, ఈ డ్రాగ్ ప్రదర్శకుల సంస్కృతి విదేశాల్లో చాలా ఫేమస్. భారత్‌లో మాత్రం దీనికంత ప్రాచుర్యం లేదు. వీరిద్దరూ డ్రాగ్ డ్యాన్సర్లుగా వేషం కట్టి, నృత్యం చేస్తుంటే.. కనీసం గుర్తు కూడా పట్టలేరు. వీళ్లు ఢిల్లీలో కొన్ని హైక్లాస్ పబ్‌లు, బార్‌లలో మాత్రమే ఇలా డ్రాగ్ క్వీన్స్‌గా ప్రదర్శనలిస్తారు. నేను పగలు మానవ హక్కుల లాయర్‌ని. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఆఫీసులో ఉంటా. కానీ, రాత్రుళ్లు మరో అందమైన జీవితాన్ని కూడా ఆస్వాదిస్తున్నా. స్త్రీత్వాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం లభిస్తోస్తున్నది. దీనివల్ల నాకెలాంటి ఇబ్బందీ కలగట్లేదు అని ఆయుష్మాన్ చెబుతున్నాడు. మగవాళ్లు పూర్తిగా అమ్మాయిల్లా తయారై ప్రదర్శనలు ఇస్తే వాళ్లను డ్రాగ్ క్వీన్ అ, ఆడవాళ్లు మగవాళ్లలా తయారైతే డ్రాగ్ కింగ్ అనీ అంటారు.