నమో నమామి

వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్నా శశిని కలంక కలేవ నిమగ్నా కేశవ ధృత సూకర రూప జయజగదీశ హరే॥

వరాహావతారం దాల్చిన ఓ కేశవా! నీ కోరలపైన నిలబడి వున్న ఈ భూగోళం మచ్చలున్న చంద్రుని వలె ప్రకాశిస్తున్నది అన్న జయదేవ మహాకవి స్తుతి ఈవారం పఠనీయం. ఎందుకంటే, వరాహస్వామి జయంతి హైందవుల మహా పర్వదినాలలో ఒకటి. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి కంటే ముందే ఈ స్వామినే దర్శించుకోవాలన్న నియమం మనకు తెలిసిందే. వరాహస్వామికి ఆలయాలు ఎక్కువగా లేకపోతేనేం, దశావతారాలలో ఆయనది అత్యంత కీలకమైన మూడో అవతారం. ఆయన పుట్టుకే ఒక మహాద్భుతం. భక్తితో ప్రార్థిస్తే మనల్ని కరుణించకుండా ఉంటాడా!