ఎటువైపో నీ పరుగు..

క్రాంతి, పృథ్వీ, అవంతిక నాయకానాయికలుగా నటిస్తున్న ఎటువైపో నీ పరుగు చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మద్దినేని రమేష్‌బాబు దర్శకుడు. సాయిశాన్వి క్రియేషన్స్ పతాకంపై వి.అలేఖ్య, పి.రాంబాబు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి భీమనేని శ్రీనివాసరావు క్లాప్‌నివ్వగా, దామోదరప్రసాద్, శ్రీవాస్ కెమెరా స్విఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ఇద్దరబ్బాయిలు, ఓ అమ్మాయి మధ్య జరిగే ముక్కోణపు ప్రేమకథా చిత్రమిది. థ్రిల్లర్ అంశాలుంటాయి. హైదరాబాద్, వైజాగ్‌లలో చిత్రీకరణ జరుపుతాం. ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. హర్షవర్దన్, నితిన్, రమేష్, దివ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ:క్రాంతి, మాటలు: వినయ్, శ్రీనివాస్, కెమెరా: వెంకట్ మన్నం, సంగీతం: వి.కిరణ్‌కుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మద్దినేని రమేష్‌బాబు.

Related Stories: