డ్యాన్సింగ్ జవాన్!

ఇండియాను ఎప్పటికప్పుడు శత్రువుల దాడి నుంచి కంటి రెప్పలా కాపాడుతూనే ఉంటారు మన జవాన్లు. అందరిలాగే వీరికి కూడా కొన్ని కోరికలు, ఆశలు ఉంటాయి. కాస్త తీరిక దొరికినా సమయాన్ని వృథా చేయకుండా సరదాగా తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంటారు. వీరిలో ఒక జవాన్ చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

భారతదేశ సరిహద్దులను అంటిపెట్టుకొని ఉంటారు జవాన్‌లు. వారు ఉన్నారన్న భరోసాతో మనం కంటి నిండా నిద్రపోతున్నాం. ఆర్మీలకు కూడా అందరిలా పాటలు పాడడం, డాన్స్ చేయడం సరదాగా మాట్లాడటం వంటి అభిరుచులు ఉంటాయి. శత్రువు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తారో అని నిమిషం సమయాన్ని కూడా వృథా చేయకుండా దేశానికి కాపలా ఉంటారు. కొంచె తీరిక సమయంలో ఒక ఇండియన్ జవాన్ సరదాగా చేసిన డ్యాన్స్ ఇప్పుడు వైరల్‌గా మారింది. బాలీవుడ్ పాటకు అద్భుతంగా కాళ్లు కదుపుతూ ఔరా అనిపించారు. ఈ జవాన్ ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లా స్టెప్పులేశారు. అందరి అబినందనలను పొందాడు. ఈ జవాన్ చేసిన డ్యాన్స్ మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నది.