ట్వీట్

చిన్మయి శ్రీపాద @Chinmayi ఇంధన ధరలు ఎందుకు పెరుగుతాయో అర్థం కాదు. నిజంగా అర్థం కావడం లేదు. చిన్మయిని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 935,912

మాటకు మాట

పక్కోడు ఎప్పుడూ మన ఇంటివాడు కాలేడు. టీడీపీ, కాంగ్రెస్ కలయిక కూడా అంతే. -Sri Hari

కేసీఆర్ గారు టీఆర్‌ఎస్ పార్టీలో ఆంద్రోళ్లను చేర్చుకోలేదు. అందులో ఉన్న మన తెలంగాణ నేతలను మన పార్టీలో కలుపుకొని తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశారు. మరి ప్రస్తుతం కాంగ్రెస్, కోదండరాం టీజేఎస్ పార్టీలు ఏం చేస్తున్నాయి? అధికార దాహంతో రగిలి పొత్తు పేరుతో భూస్థాపితం అయిపోయి ప్రభావం కోల్పోయిన తెలుగుదేశం పార్టీకి తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నాయి. పరోక్షంగా దొంగ చంద్రబాబు చేతిలో తాళాలు పెడుతున్నాయి. -Tajnoth Raghuveer

వైరల్ వీడియో

తనీష్ చాలా రోజుల తర్వాత రంగు పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్నది. Rangu Theatrical Trailer | Rangu Movie | Thanish , Priya Singh | Yogeshwara Sharma Total views : 275,133+ Published on Sep 9, 2018