ట్వీట్

ఈ పాట గురించి ఆసక్తిగా, ఆతృతగా ఉన్నాను. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ పాట సోమవారం విడుదల చేయనున్నాం. ఆలస్యం చేసినందుకు మన్నించండి. అయినా ఈ పాట బాగుంటుంది. ఒక కొత్త నృత్య తీరుకు ఆజ్యం పోస్తుంది. సమంత అక్కినేని @Samanthaprabhu2
సమంతను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 6,989,161

మాటకు మాట

ఇగ మీకు మిగిలింది ఒకటే కేసు. కేసీఆర్ ఎన్నికల్లో పోటీ చేయొద్దని కేసు వేయండీ! -Venu Javvaji

ఖమ్మం నుంచి కొంగర కలాన్ నూట తొంభై ఏడు కిలోమీటర్లు ఉంది. ముప్పై స్పీడ్ ఉరికే ట్రాక్టర్లు ఎక్కి ఎవరైనా అన్ని కిలోమీటర్లు పోతారా? ఖాళీ ట్రాక్టర్లు పోతున్నాయ్ అని గొప్ప లాజిక్ తీసినట్టు ఫీలవుతూ ఎవడో పోస్టు పెట్టిండు. ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు మన పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి కాబట్టి స్పెషల్ అట్రాక్షన్ కోసం ట్రాక్టర్లను, ఎడ్ల బండ్లను తీసుకువస్తున్నారు. అంతేకానీ అందులోనే ఎక్కి రావాలని రూల్ ఏమీ లేదు. ఒక వేళ ఏనుగులను తీసుకుపోతే ఖాళీ ఏనుగులు తీసుకుపోతున్నారు. ఏనుగు ఎక్కి రావడం లేదు అని అందులో కూడా చేపలు పట్టేలా ఉన్నారు కదరా మీరు! -నజీర్ మహ్మద్

వైరల్ వీడియో

అత్త చేతిలో సాండ్‌విచ్‌లా నలిగిపోయిన అల్లుడు, మరదలి చేష్టలకు మెషీన్‌లో చెరకు అయిన బావ, తండ్రి చేతిలో బలైన కొడుకు పరిస్థితి ఎలా ఉంటుంది? శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నాగచైతన్య పరిస్థితి అలాగే ఉంటుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. Shailaja Reddy Alludu Official Trailer | Naga Chaitanya | Anu Emmanuel | Ramya Krishnan | Maruthi Total views : 2,832,479+ Published on Aug 30, 2018

Related Stories: