ట్వీట్

సుదర్శన్ పట్నాయక్@sudarsansand సుదర్శన్ పట్నాయక్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 512,415
కేరళ వరద బాధితుల సహాయం కోసం చేతులు కలుపండి. ఒడిశాలోని పూరి బీచ్‌లో ఇసుకతో కేరళ పరిస్థితిపై ఆర్ట్ వేశాను. ఇలాంటి కీలక దశల్లోనే మనవంతుగా ఆదుకోవాలి.

కామన్‌మ్యాన్ వాయిస్

సరే మీ దిక్కుమాలిన లాజిక్‌నే ఫాలో అవుదాం. ఆలయంలోకి మహిళలను అనుమతించనందుకే ఈ విలయతాండవం అనుకుందాం. ఒప్పుకొందాం కూడా! మరి పదేళ్ల చిన్నారి ఆసీఫాను అలాంటి ఆలయంలోనే మానభంగం చేసి చంపేశారు కదా! మరి దేవునికి అప్పుడెందుకు కోపం రాలేదు. ఈ కేరళలో ఉన్నదే దేవాలయమా? అది కాదా? లేకుంటే దీనికే పవర్స్ ఉన్నాయా? దానికి లేవా? ఏదీ కాకుంటే ఆ అమ్మాయి ముస్లిం అని హిందూ దేవుళ్లు మౌనంగా ఉన్నారా? -Deekshith Rodda

కల్లోల కేరళను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలి. లక్ష కోట్ల రూపాయలు తక్షణ సాయం అందించాలి. - Raju Goud

వైరల్ వీడియో

ప్రేమించిన అమ్మాయి కుటుంబాన్ని వరదల్లోంచి కాపాడబోయి జై ప్రాణాలు కోల్పోతే.. కళ్ల ముందే ప్రియుడు కొట్టుకుపోవడంతో శ్యామల నోటిమాట పడిపోయింది. కేరళలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో అందర్నీ కంటతడి పెట్టిస్తున్నది. Real Love Story In Kerala Floods || SumanTV Total views : 400,079+ Published on Aug 20, 2018