ట్వీట్

బై బై లండన్. నెల రోజుల పాటు ఆతిథ్యాన్నిచ్చి, ఆనందాన్నిచ్చావు. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నేను నీకు ఫిదా అయ్యాను. ఇక్కడి నుంచి ఉక్రెయిన్ వెళ్తున్నాను.
రకుల్ ప్రీత్@Rakulpreet రకుల్ ప్రీత్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 2,709,322

కామన్‌మ్యాన్ వాయిస్

సోషల్‌మీడియా వేదికగా పరిచయాలు పెంచుకొని ఇన్‌బాక్స్‌లకు పోయి అర్జెంటుగా అక్కా, అన్నా అని పైసల్ అడుగుతరు. పెద్ద లీడర్లతో ఫొటోలు దిగి ఇది, అది అని దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తరు. ఇట్లా చేసే వాళ్లని చూస్తూనే ఉన్నాం. గతంలో కూడా హెచ్చరించిన. కాస్త జాగ్రత్త. వీళ్లు తెలంగాణ పేరు చెప్పుకొని దొరికినోడిని దోసుకుంటనే ఉంటరు. మాయ మాటలు చెప్పి బుట్టలేసుకుంటరు. -Vamshi Kariveda భాష తెలిసిన ప్రతోళ్లు రాయడం మొదలుపెడితే సాహిత్యం చావక బతుకుతుందా?! -Harish Kuvvakula

వైరల్ వీడియో

భిన్న కథలను ఎంచుకొని సినిమాలు చేసే అక్షయ్ గోల్డ్ అనే ప్రత్యేక సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కూడా కొంత భిన్నంగా చేశాడు. అందుకే ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్నది. When Ashish Chanchlani Met Akshay Kumar | GOLD Total views : 5,033,714+ Published on Jul 26, 2018