ట్వీట్

బంగారు పతకం సాధించిన హిమదాస్ నీకు కంగ్రాట్స్. నీ విజయగాథ ఎంతోమందిలో స్ఫూర్తిని నింపింది. వారిలో నేను కూడా ఉన్నాను.
శ్రద్ధాకపూర్‌ని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న సంఖ్య 10,711,453 శ్రద్ధాకపూర్@ShraddhaKapoor

కామన్‌మ్యాన్ వాయిస్

దేవుడు ఉన్నాడనేది నా నమ్మకం. లేడనేది నీ నమ్మకం. ఎవరి నమ్మకాల్లో వాళ్లం బతుకుతాం. నేను నీ నమ్మకాల జోలికి రానప్పుడు.. నువ్వు నా జోలికి వచ్చి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టొద్దు. ఎవరికి ఏ నమ్మకంలో ఆనందం ఉంటే అదే అనుసరించడం బెటర్. - Suryaprakash Josyula

ప్రేమకున్న శక్తి ఎంత ప్రబలమైందంటే.. సాధ్యమైనంత అత్యున్నత పరిత్యాగం దాని వల్లే సంభావ్యమవుతుంది. - Ravi Kishore Babu

మనిషి నమ్మకాలన్నీ నిజాలు కావు.. అవి ఉట్టి నమ్మకాలు మాత్రమే.. మీరు నమ్మినవన్నీ నిజాలు అనుకుంటే.. దానికన్నా మూర్ఖత్వం మరొకటి లేదు! - సుధా కౌముది

ఏసీ గదుల్లో సేద తీరేవారు కాదు మా మంత్రులు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తారు. - Tajnoth Raghuveer Rathode

వైరల్ వీడియో

విజయ్ సేతుపతి, త్రిష కలిసి నటించిన 96 సినిమా అఫీషియల్ టీజర్ విడుదలైంది. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. 96 Official Teaser | Vijay Sethupathi, Trisha Krishnan | Madras Enterprises | C. Prem Kumar | Govind Total views : 2,261,573+ Published on Jul 12, 2018