టెక్ చిట్కాలు

నిమిషంలో నాలుగు సార్లు మొబైల్ చెక్ చేసుకునే అలవాటు పోవాలంటే ఈ చిట్కాలు పాటించండి. -సెట్టింగ్స్‌లోకి వెళ్లి నోటిఫికేషన్స్ ఆఫ్‌లో పెట్టండి. ఫేస్‌బుక్, వాట్సప్ లాంటి యాప్‌ల ద్వారా వచ్చే నోటిఫికేషన్స్ కనిపించవు. -రోజులో ఫలానా టైమ్‌లో మాత్రమే బ్రౌజ్ చేయాలి అని ఒక నియమం పెట్టుకోండి. టైమ్ సేవ్ అవుతుంది. -డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు డునాట్ డిస్టర్బ్ మోడ్ లేదంటే డ్రైవ్‌మోడ్ ఆన్‌లో పెట్టుకోండి. డ్రైవింగ్ నుంచి మీద ధ్యాస ఫోన్ మీదకు వెళ్లదు.