టాటా ఏఐఏ లైఫ్ నుంచి నెలసరి గ్యారంటీ ఆదాయ పాలసీ

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ వినూత్నంగా గ్యారంటీ నెలసరి ఆదాయ పథకాన్ని ప్రవేశపెట్టింది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ఆదాయానికి గ్యారంటీ ఉంటుంది. పన్నేండ్ల పాలసీ కాలపరిమితితో తర్వాత వరుసగా 24 ఏండ్ల పాటు ప్రతి నెల కచ్చితమైన పన్నులేని ఆదాయాన్ని అందించనుంది. 288 నెలల పాటు పన్ను లేని నెలసరి ఆదాయాన్ని అందిస్తున్న ఏకైక పథకం ఇదే. రిటైర్‌మెంట్, పిల్లల చదువు వంటి ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పాలసీని తీసుకునే వారు 5,8, 12 ఏండ్ల పాటు ప్రీమియం చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

ప్రీమియం చెల్లింపు లేదా పాలసీ కాల పరిమితి ముగియగానే 5 ఏండ్ల ప్రీమియం చెల్లించిన వారికి 10 ఏండ్లు, 8 ఏండ్ల ప్రీమియం చెల్లింపునకు 16 ఏండ్లు, 12 ఏండ్ల ప్రీమియం చెల్లింపునకు 24 ఏండ్ల పాటు ప్రతీ నెలా ఆదాయాన్ని చెల్లిస్తారు. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే వార్షిక ప్రీమియంకు 11 రెట్లు చెల్లిస్తారు. లేదా చెల్లించిన మొత్తం ప్రీమియం పైన 105 శాతం మొత్తాన్ని అధికంగా చెల్లిస్తారు లేదా మెచ్యూరిటీ మీద గ్యారంటీ మొత్తాలను చెల్లిస్తారు. ఒకవేళ పాలసీ కాలపరిమితి ముగిసి నెలసరి ఆదాయం పొందుతున్న సమయంలో పాలసీదారుడు మరణిస్తే ఆ తర్వాత నెలసరి ఆదాయాలన్నింటినీ నామినీకి అందిస్తారు. నామినీ కూడా నెల సరి ఆదాయాన్ని లేదా మొత్తం ఒకేసారి తీసుకునే సదుపాయం కూడా ఈ పాలసీలో ఉంది. ఆప్షనల్ రైడర్ ద్వారా పాలసీ దారుడు జీవిత బీమా కవరేజిని పెంచుకునేందుకు కూడా వీలు కల్పిస్తున్నారు.