టమాటాలను వేడి నీటితో ఉడికిస్తే..

-ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడు చక్కెర వేస్తే త్వరగా వేగుతాయి. -ఇంగువ గడ్డ కడితే, ఆ డబ్బాలో నాలుగు పచ్చిమిరపకాయలు వేస్తే పొడిగా అవుతుంది. -టమాటాలు వండడానికి ముందు పదినిమిషాల పాటు వేడినీటిలో నానపెడితే వంటకాలు రుచిగా ఉంటాయి. -కోడిగుడ్డు పెంకులను కిటికీల వద్ద పెడితే, క్రిమి కీటకాలు దరిచేరవు. -వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలను వేస్తే, మంచి వాసన వస్తుంది. -వంకాయకూరలో రెండు చుక్కలు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు, రుచిగా ఉంటుంది. -నిలువ పచ్చళ్లకు ఆవనూనెను వాడితే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. -కాలిఫ్లవర్, పాలకూర వంటి వాటిని శుభ్రం చేయటానికి నీటిలో కొద్దిగా వెనిగర్ కలుపండి. -గుడ్లను ఉడికించే నీళ్లల్లో కాస్త ఉప్పు వేస్తే అవి పగిలిపోకుండా ఉంటాయి.