జెమ్స్ చాలెంజ్!

జెమ్స్ చూడగానే పిల్లల నోరూరుతుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని వ్యాపార రంగాల వాళ్లు కొత్త ఆఫర్లను పెడుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వెరైటీ కాన్సెప్ట్‌లను తయారు చేస్తున్నారు. క్యాడ్‌బరీ జెమ్స్ వాళ్లు చిన్నారులను టార్గెట్ చేస్తూ మూడు రంగుల జెమ్స్‌ని వాడుతూ ఏదైనా ఒక బొమ్మను వేయండి. బహుమతులు కొట్టేయండి అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. చేసిన వాటిని ఫేస్‌బుక్‌లో హాష్‌ట్యాగ్ జెమ్స్ ఆఫ్ ఇండియా, ఇండిపెండెన్స్ డే అని ట్యాగ్ చేయాలని సూచించింది. చిన్నారులు పోటీలు పడి పంపిస్తున్నారు.