జుట్టుకు రాసుకుంటే!

-కీరదోస గుజ్జు, ఉప్పు, మిరియాల నూనెను కలుపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. -శనగపిండిలో కొంచెం బాదం నూనె కలుపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. -ద్రాక్షరసంలో కొంచెం పెరుగు, చక్కెర వేసి బాగా కలుపాలి. ఈ ప్యాక్‌ను మొత్తం జుట్టుకి పట్టించాలి. 30 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు తొలిగి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. -టమాటా గుజ్జులో రోజ్ వాటర్, బెల్లం కలుపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాయాలి. 15 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం జుట్టు వల్ల మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. -నిమ్మరసంలో కొంచెం పసుపు, తేనెను వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి.