జీవన వేదం

కొడుకులు తమ తల్లులకు విధిగా సేవలు చేయా లి. తల్లి వాత్సల్యం తనయునిపై అలా అనంతం గా కురుస్తూనే ఉంటుంది. వారు సేవలు చేయకపోయినా ఆ తల్లుల ప్రేమ మాత్రం తగ్గదు. అలాగని కొడుకులు సేవలు మానడం ధర్మమూ కాదు. పరమాత్మ కూడా తన బిడ్డలైన మానవాళిపై కనికరం చూపుతూనే ఉంటాడు. ఎవరికి, వారి వారి కర్మానుసారం, ప్రారబ్దానుసారం ఇవ్వాల్సినవి ఇస్తూనే ఉంటాడు. తల్లి శరీర పోషణ చేస్తే, పరమాత్మ ఆత్మపుష్ఠిని కలిగిస్తాడు. ఇలా భగవంతుడు అదృశ్యంగా ఉంటూనే భక్తుల మొర ఆలకిస్తూ ఉన్నట్టుగానే రాజు కూడా ప్రచ్ఛన్న వేషంలో ప్రజల బాగోగులు చూడవలె. వారి జీవన వికాసానికి కావలసిన అన్ని ఏర్పాట్లూ చేయవలె. ధనధాన్యాదులను వారు వృద్ధి చేసుకొనేలా చూడగలగాలి. - సామవేదం