జీవన వేదం

మానవులందరూ తమ గృహాలను పరిశుద్ధమైన జల, స్థల, వాయువులు కలిసిన చోట నిర్మించుకొని, నివాసముండాలి. జీవితంలో అన్ని రకాల సుఖాలను అనుభవించడానికి కావలసిన సంపదలను వృద్ధి చేసుకోవాలి. కానీ, ఆ సంపాదనలన్నీ ధర్మబద్ధంగానే జరగాలి. ఎవరైనా సరే, తాము ఆనందాన్ని పొందుతూ అదే సమయంలో ఇతరుల భాగ్యానికీ అవకాశమివ్వాలి. ఏ స్త్రీ పురుషులైతే యోగ్యులైన వారిని భర్త భార్యలుగా పొందుతారో వారు ఆనంద జీవనం గడుపుతారు. అలాగే, ఏ రాజైతే సత్కీర్తి పరుడో, సుశీలుడో, అభిమానం కలవాడో, విద్వాంసుడో అటువంటి రాజును ప్రజలంతా ప్రియవచనాలతో ప్రసన్నం చేసుకోవాలి. - యజుర్వేదం