చుండ్రుతో బాధ పడుతున్నారా?

తలపై ఉన్న చర్మం పొట్టుగా మారి చుండ్రులా రాలుతుంది. ఒత్తిడి, ఆందోళన, పోషణలోపం వంటి కారణాలు చుండ్రు రావడానికి కారణమవుతాయి. చుండ్రువల్ల దురద కూడా ఎక్కువ అవుతుంది. ఈ చిట్కాలను వాడితే చుండ్రు నుంచి మంచి ఫలితాలను పొందవచ్చు.
-వేపాకులతో చేసిన ఆయిల్‌ను జుట్టుకు పట్టిస్తే చుండ్రు పోవడమే కాకుండా మంచి పోషణ అందుతుంది. దానివల్ల శిరోజాలు దృఢంగా.. ఒత్తుగా పెరుగుతాయి. -కొబ్బరినూనెలో కొద్దిగా ఆముదాన్ని కలిపి కాసేపు మరిగించాలి. ఆ మిశ్రమం చల్లారిన తరువాత వెంట్రుకలకు రాసుకోవాలి. రెండు గంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో మూడుసార్లు చేస్తే చుండ్రు నుంచి మంచి ఫలితం ఉంటుంది. -మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వాటిని మెత్తని పేస్టులా తయారుచేసుకోవాలి. దీనిని జుట్టుకు పట్టించి 60 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో మూడుసార్లు చేస్తే చుండ్రు నుంచి బాధ తప్పుతుంది.