మంచు కురిసే వేళలో...

రామ్‌కార్తీక్, ప్రణాలి జంటగా నటిస్తున్న చిత్రం మంచు కురిసే వేళలో... బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలోఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ దర్శకుడు దేవా కట్టా వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశాను. దర్శకుడిగా, నిర్మాతగా ఇది నా తొలి సినిమా. టైటిల్‌కు తగ్గట్లుగానే సినిమా స్వచ్ఛమైన ప్రేమకథ నేపథ్యంలో సాగుతుంది. వైజాగ్, కూర్గ్, ఊటీ, అరకు, హైదరాబాద్‌లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఆద్యంతం ఆసక్తికరమైన కథ, కథనాలతో పాటు టెక్నికల్‌గా కూడా ఉన్నతంగా వుంటుంది. మళ్లీరావా ఫేమ్ శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, తిరుజ్ఞాన, ప్రవీణ్‌కుమార్ పంగులూరు అందించిన ఛాయాగ్రహణం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి చిత్రాన్ని డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాణం ప్రణతి ప్రొడక్షన్స్, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: బాల బోడెపూడి.