చాయ్‌పే చర్చా!

తందూరీ చికెన్, తందూరీ రోటీ ఉంది. ఈ తందూరీ చాయ్ ఏందిరా బాయ్ అనుకుంటున్నారా? సోషల్‌మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దీనిపై రచ్చ నడుస్తున్నది. పుణెలో దొరికే ఈ చాయ్ మీద ప్రస్తుతం చర్చ జరుగుతున్నది.

ఇరానీ చాయ్, అల్లం చాయ్ ఇలా చాలా రకాల చాయ్‌లున్నాయి. తందూరీ చాయ్ కూడా ఉన్నది. ఇది చాలా ఫేమస్ కూడా. ప్రమోద్ బాంకర్, అమోల్ రాజ్‌దియోలిద్దరూ తందూరీ చాయ్‌ని తయారు చేశారు. దీంతో వాళ్లిద్దరూ ఫేమస్ అయ్యారు. తందూరీ చాయ్‌కి బాగానే డిమాండు పెరిగింది. ఆ నోటా ఈ నోటా ఈ చాయ్‌కు క్రేజ్ కూడా బాగుంది. అకస్మాత్తుగా సోషల్‌మీడియాలో చర్చ మొదలైంది. దీనిమీద మిశ్రమమైన కామెంట్లు వస్తున్నాయి. కొంతమంది ఈ చాయ్‌ని ఆకాశానికి ఎత్తుతుంటే మరికొందరు పొగసూరిన వాసన వస్తున్నదని, దీనికన్నా మామూలు చాయ్ మంచిదని అభిప్రాయపడుతున్నారు.