చర్మంపై ట్యాన్‌కు పొప్పడి!

సూర్యుడి వేడికి చర్మం కమిలిపోయి, ట్యాన్ ఏర్పడుతుంది. పొప్పడిని ఉపయోగించి చాలా పద్ధతుల్లో చర్మంపై ఉన్న ట్యాన్‌ను నివారించవచ్చు.

-పొప్పడి మీదున్న తొక్క తీసి ముక్కలుగా కోసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ మీద రాస్తూ మర్దనా చేయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఇలా తరుచూ చేస్తే మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. -పొప్పడి పేస్టు, తేనె, నిమ్మరసాన్ని వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాస్తూ మర్దన చేయాలి. 25 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే చర్మంపై ఉన్న ట్యాన్ తొలిగిపోయి అందంగా తయారవుతారు. -పొప్పడి పేస్టూ, పెరుగును వేసి బాగా కలుసాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరుచూ చేయడం వల్ల మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. -టమాటా, ఓట్‌మీల్, నిమ్మరసం, పొప్పడి పేస్టును వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ట్యాన్ ఉన్న ప్రదేశంలో రాసుకోవాలి. 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న ట్యాన్‌ను తొలిగించవచ్చు.