శాస్త్రవేత్త జీవితకథలో

వివాదాస్పద భారతీయ శాస్త్రవేత్త నంబీ నారాయణన్ జీవితం వెండితెరపై ఆవిష్కృతం కాబోతున్నది. ఇస్రోలో సైంటిస్ట్‌గా పనిచేసిన నారాయణన్‌ను భారతీయ అంతరిక్ష రహస్యాల్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు ఇరవై రెండేళ్ల తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసు నుంచి అతడికి క్లీన్‌చీట్ ఇవ్వడమే కాకుండా యాభై లక్షలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. నంబీనారాయణన్ జీవితంలోని ఎత్తుపల్లాలను ఆవిష్కరిస్తూ రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్స్ పేరుతో తమిళంలో ఓ చిత్రం రూపొందుతున్నది. నంబీ నారాయణన్ పాత్రలో మాధవన్ నటిస్తున్నారు. బుధవారం ఈ చిత్ర టీజర్‌ను హీరో సూర్య విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.