గోల్డ్‌మెడల్ కొట్టాలని..

డాక్టర్ వర్ష పురానిక్ స్కేటింగ్ చాంపియన్. రోజుకు ఏడు గంటల పాటు స్కేటింగ్‌లో శిక్షణ తీసుకుం టున్నది. 30 యేండ్ల వయసు గల ఈమె మైసూరు నుంచి ఏషియన్ గేమ్స్‌కి ఎంపిక అయిన ఏకైక మహిళగా గుర్తింపు పొందింది. ఎనిమిది దేశాల నుంచి టాప్ 16 మంది అథ్లెట్స్ ఈ పోటీల్లో పాల్గొననున్నారు. వాళ్లందరికీ ఈమె గట్టి పోటీ ఇవ్వనుంది. మూడు సంవత్సరాల వయసులో స్కేటింగ్ మొదలుపెట్టిన వర్ష.. నేషనల్ రోలర్ స్కేటింగ్‌కి ప్రాతినిధ్యం వహించింది. అతి పిన్న వయసులో ఈ ఆటలో ప్రాతినిధ్యం వహించిందిగా కూడా రికార్డు సొంతం చేసుకున్నది. 2013లో కర్ణాటక ప్రభుత్వం నుంచి ఏకలవ్య అవార్డును పొందింది. ఇప్పటిదాకా వివిధ కాంపిటేషన్‌లలో 52 గోల్డ్ మెడల్స్ సాధించింది. 21 నేషనల్ చాంపియన్స్ గెలుపొందింది. స్పీడ్ స్కేటింగ్ లోనూ వర్ష మొదటగా నిలుస్తుంది. కర్ణాటక తరపున ఎన్నో విజయాలు తన ఖాతాలో వేసుకుంది. ఐస్ స్కేటింగ్‌లో 13వ ర్యాంకులో ఉన్న వర్ష.. ఇప్పుడు ఈ ఏషియన్ గేమ్స్‌లో త్రివర్ణ పతాకాన్ని రెప రెపలాడించాలని ఊవిళ్లూరుతున్నది. మరి ఆమె కోరిక నేరవేరాలని మనమూ ఆశిద్దాం.