గోల్కొండ కోట సౌండ్ అండ్ లైట్ షో

మన పర్యాటక ప్రాంతాలను మరింత అకట్టుకునేలా చేసి పర్యాటకుల సంఖ్యను పెంచడానికి తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా చారిత్రక ప్రదేశాలను అన్ని వర్గాల వారికి చేరువ చేయడం కోసం సౌండ్ అండ్ లైట్ షోలను నిర్వహిస్తున్నది.

తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక జాతీయ పర్వదినాలైన జనవరి 26, ఆగస్టు 15 జెండావిష్కరణకు కేంద్రంగా మారిన గోల్కొండకోట చారిత్రక వైభవాన్ని చెప్పడం కోసం ప్రత్యేక సౌండ్ అండ్ లైట్ షోలను మరింత ఆధునీకరించింది. మొదటి షో: ఇంగ్లీష్ (అన్ని రోజులు), 2వ షో: తెలుగు (సోమ, బుధ, శుక్రవారాల్లో,) హిందీ (మంగళ, గురు, శని, ఆదివారాల్లో) నవంబర్-ఫిబ్రవరి ఫస్ట్ షో:సాయంత్రం 6.30, సెకండ్ షో: సాయంత్రం 7.45 నిమిషాలకు. (మార్చి-అక్టోబర్) ఫస్ట్ షో: -సాయంత్రం 7.00, సెకండ్ షో: సా.8.15ని.లకు.
-కోట సందర్శన సమయం: ఉదయం 9.00 నుండి సాయంత్రం 5.00 వరకు టికెట్ కౌంటర్ ఓపెన్ సమయం సాయంత్రం 5.30 -మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నం-:040-23512401 -బల్క్ బుకింగ్స్ కోసం సంప్రదించాల్సిన నం- 9640069290