గులాబీ పెదాల కోసం...

-పెదాలపై పేరుకుపోయిన మృతకణాలను మృదువుగా తొలగించండి. -కుంకుమపువ్వు, ఒక టీస్పూను పాలు, టీస్పూను మీగడపాలు మిశ్రమంగా చేసి దాన్ని ఫ్రిజ్‌లో పెట్టాలి. -చల్లబడిన ఈ మిశ్రమాన్ని పెదాల మీద రాసుకుని కొంతసేపు ఉంచుకోవాలి. ఆ తర్వాత దూదితో పెదాలను సున్నితంగా తుడిచేయాలి. -గులాబీ రెమ్మల్ని పేస్టుగా చేసి దాన్ని పాలలో కలిపి ఆ మిశ్రమాన్ని పెదాలకు రాయాలి. కొద్దిసేపటి తర్వాత పాలలో తడిపిన దూదితో పెదాలను తుడిచేయాలి. -బీట్‌రూట్ రసంలో మీగడ కలిపి ఆ పేస్ట్‌ని పెదాలకు ఐప్లె చేయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. -టమాట పేస్టు, మీగడ రెండింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని రెగ్యులర్‌గా పెదాలకు ఐప్లె చేస్తే నల్లటి పెదాలు ఎర్రగా మారుతాయి.