రాజశేఖర్‌కు జోడీగా..

డా॥ రాజశేఖర్ హీరోగా అ! ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కీ పేరుతో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మిస్తున్నారు. పరిశోధనాత్మక థ్రిల్లర్‌గా 1980 కాలం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో హీరో రాజశేఖర్‌కు జోడీగా ముగ్గురు కథానాయికలు నటించనున్నారు. ఇప్పటికే ఓ కథానాయికగా నందితా శ్వేతాను ఎంపిక చేసిన చిత్ర వర్గాలు ఆదాశర్మతో పాటు స్కార్లెట్ విల్సన్‌ను తాజాగా ఖరారు చేశారు. క్షణం తరువాత ఆదాశర్మ తెలుగులో నటిస్తున్న సినిమా ఇదే. ప్రస్తుతం ఆమె కమెండో-2 చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న హిందీ చిత్రం కమెండో-3తో పాటు ప్రభుదేవా హీరోగా నటిస్తున్న చార్లీ చాప్లిన్-2లోనూ నటిస్తోంది.