ముస్లింలు,ప్రజలకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు:సీఎం కేసీఆర్

హైదరాబాద్: ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ముస్లింలకు, రాష్ట్ర పౌరులందరికీ సీఎం కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల జీవితాలు సుఖసంతోషాలతో వర్థిల్లే దిశగా బంగారు తెలంగాణ సాధన కోసం ప్రతీ ఒక్కరం అల్లాను ప్రార్థిద్దామని పిలుపునిచ్చారు. దేవునికి దగ్గరయేందుకు మానవసమాజం చేసే ప్రయత్నంలో భాగంగా జరుపుకునే పండుగ ఈద్ ఉల్ ఫితర్ అని.. ఉపవాస దీక్షలు, ప్రార్థనల ద్వారా మన శరీరాలను, హృదయాలను పునీతం చేసుకున్నామన్నారు. ప్రాపంచిక సుఖాలవైపు మన మనసు మళ్లకుండా మన ఆలోచనలను అదుపులో ఉంచుకుమన్నామని పేర్కొన్నారు.
× RELATED ప్రియా ప్ర‌కాశ్ మూవీ వేడుక‌కి గెస్ట్‌గా బ‌న్నీ