విషమంగా ఉన్న సింగర్ ఆరోగ్యం!

ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ లాతవియా రాబర్సన్ (34) ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల తాను గర్భంతో ఉన్నానని, త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నానంటూ ఇన్‌స్ట్రాగ్రామ్ పేజ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఇంతలోనే ఆమె ఆరోగ్యంపై అనేక వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గర్భానికి సంబంధించిన సమస్య తలెత్తడం వలన లాతవియాను ఆసుపత్రికి తరలించారట. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉండగా, ఈ హాలీవుడ్ సింగర్ క్షేమంగా భయటపడాలని అందరు కోరుకుంటున్నారు. బాలనటిగా పరిచయం అయిన లాతవియా ప్రస్తుతం ఓ రియాలిటీ షో చేస్తుంది.
× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..