కాకరలో విత్తనోత్పత్తి

రాష్ట్రంలో సాగవుతున్న కుకుర్‌బిటేసి కుటుంబానికి చెందిన పందిరి కూరగాయ కాకర. మేలైన ఔషధ గుణాలున్న దృష్ట్యా వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతారు. అయితే విత్తు దగ్గరే రైతు చిత్తవు తున్నాడు. రైతు తక్కువ ఖర్చతో తమ స్థాయిలో కాకరలో విత్తనోత్పత్తిని చేసుకుని తన అవసరాలకు వాడుకోవచ్చు. Kakarakaya రాష్ట్రంలో సంవత్సరమంతా ఈ పంటలో విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. అయితే గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో యాసంగి లేదా ఎండాకాలంలో మాత్రమే విత్తనోత్పత్తి చేపట్టాలి. ఎత్తైన గిరిజన ప్రాంతాలలో అయితే కచ్చితంగా ఎండాకాలంలోనే విత్తనం ఉత్పత్తి చేయా లి. సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటివారంలో విత్తనాలు విత్తుకోవచ్చు. రకాలు:పాలి, లాంగ్‌వైట్, పూసాదో మౌసమి, కోయంబత్తూర్ లాంగ్ గ్రీన్, అర్కాహరిత, పూసావివేక్, నేలలు: విత్తనోత్పత్తికి ఎంచుకునే నేలల్లో సొంతంగా విత్తుకున్న మొక్కలు ఉండరాదు. మురుగునీరు పోయే నేలలు, సారవంతమైన నేలలు అనుకూలం. విత్తన ఎంపిక: కచ్చితంగా నమ్మకమైన సంస్థ లేదా నాణ్యమైన వనరుల నుంచి మాత్ర మే విత్తనం సేకరించాలి. నాణ్యంగా, ఆరోగ్యకరంగా ఉండి చీడపీడలు లేని విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. పలిగిన, రంగు కోల్పోయిన విత్తనాలు తీసివేయాలి.

విత్తన మోతాదు: ఎకరాకు రెండు కిలోలు

నాటడానికి ముందు విత్తనాలను ముప్పై నిమిషాల పాటు వెచ్చని నీటిలో ఉంచాలి. దీంతో విత్తన చివరి గట్టిపొర మెత్తబడుతుంది. తడి ఉన్న గోనె సంచి లేదా తేమతో కూడిన గుడ్డ సంచులలో 3-4 రోజులు ఉంచితే కూడా గింజ లు మెత్తబడి, మొలకలు త్వరగా వస్తాయి. కిలో విత్తనానికి 4 గ్రాముల చొప్పున ట్రైకోడెర్మా విరిడి జీవ శిలీంధ్ర నాశనితో విత్తనశుద్ధి చేస్తే శిలీంధ్రాల తాకిడి తగ్గుతుంది.

ప్రధాన పొలంలో నాటడం

ప్రధాన పొలాన్ని 3-4 సార్లు మెత్తగా దున్నాలి. రెండు మీటర్ల మధ్య దూరంతో 60 సెం.మీల వ్యాసార్థంతో కాలువలు చేయాలి. కాలువల సాలులో ఒక మీటరు లోతులో 30 సెం.మీ వ్యాసార్థంతో గుంతలు తయారు చేయాలి. గుంతలలో రెండు సెం.మీ లోతులో నిలువుగా విత్తనాలు విత్తుకోవాలి. మొదట ఒక గుంతకు రెండు విత్తనాలు నాటి, మొలకొచ్చిన తర్వాత రెండి రెండింటిలో ఆరోగ్యంగా, బలంగా ఉన్న మొక్కను మాత్రమే ఉంచి మిగతా దానిని తీసివేయాలి. విత్తే ముందు గుంతలను కచ్చితంగా తడుపాలి.

పోషక యాజమాన్యం

ఎకరానికి 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు చివరి దుక్కిలో వేయాలి. ఒక కిలో పశువుల ఎరువును 100 గ్రాముల వేపచెక్కతో కలి పి ప్రతి గుంతలో ప్రాథమికంగా వేయాలి. ఒక నెల తర్వాత గుంతకు 500 గ్రాముల చొప్పున వానపాముల ఎరువును పైపాటుగా మొక్క మొదలులో వేయాలి. సకాలంలో కలుపును తీసివేయాలి. నాటిన తర్వాత వారం రోజుల వ్యవధులలో నీటి తడువివ్వాలి. పూత సమయం, కాయలు ఏర్పడే దశలలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. Kakarakaya2

కల్తీలు ఏరివేత

కాకర స్వతహాగా స్వపరాగం చెందే మొక్క అయితే కొంతమేరకు పరపరాగ సంపర్కం కూడా జరుగుతుంది. శాఖీయ దశ, పూత దశ, కాయలు ఏర్పడే దశలలో ఎంచుకున్న రకం లక్షణాల ఆధారంగా కల్తీలు గుర్తించి ఏరివేయాలి. 0.2 శాతం కంటే కల్తీలు మించకుండా చూడాలి. మూడు దఫాలుగా క్షేత్ర తనిఖీలు చేపట్టాలి. వేర్పాటుదూరం: ఫౌండేష న్ విత్తనానికైతే 1000 మీట ర్లు, ధృవీకరణ విత్తనానికైతే 500 మీ. వేర్పాటు దూరం ఉండేలా చూడాలి. దీంతో కల్తీలు సాధ్యమైనంత వరకు ఉండకపోవచ్చు. కాయల కోత: కాయలు ఆకుపచ్చ రంగు నుంచి పసుపు పచ్చ లేదా నారింజ రంగులోకి మారిన దశలో మొక్క నుంచి సేకరించాలి చేతులతో మొక్కల నుంచి ఏరి, పగిలేదాక నీడలో ఆరబట్టాలి. అవి పగిలిన తర్వాత ప్రకాశవంతమైన విత్తనాలు కన్పిస్తాయి. మరో పద్ధతిలో అయితే తోడుకలు తీసిన తర్వాత రక్తపు రంగు తో కూడిన గింజలను ఒకరోజు పాటు నీళ్లలో మురుగబెట్టాలి. ఆ తర్వాత బాగా కడిగి, ఎండబెట్టి నిల్వ చేయాలి. విత్తన తేమ ఏడు శాతం మించకుండా ఉండాలి. చల్లని, పొడి పరిస్థితులలో నిల్వ చేస్తే ఐదేండ్ల వరకు మొలక శాతం తగ్గకుండా కాకర గింజలు నాణ్యంగా ఉంటాయి. ఒకసారి ఉత్పత్తి చేసిన విత్తనాన్ని రైతులు సిఫా రస్సు చేసిన నాణ్యతా ప్రమాణాలు ఉంటే నాలు గు, ఐదేండ్ల వరకు సాగు చేసుకోవడానికి వాడుకోవచ్చు. మేలైన దిగుబడులు పొందవచ్చు. అయితే సూటి రకాలలో మాత్రమే విత్తనోత్పత్తి చేసుకోవాలి. హైబ్రీడ్లలో రైతు స్థాయిలో విత్తనోత్పత్తి చేపట్టరాదు. Saidaiah
× RELATED అటవీ చెట్ల పెంపకానికి ప్రోత్సాహం