కంప్యూటర్ అమ్మబడును!

ఆపిల్ కంపెనీ.. సాంకేతిక రంగంలో దిగ్గజం. ఆ కంపెనీ తన స్వహస్తాలతో తయారుచేసిన మొట్టమొదటి కంప్యూటర్ అమ్మకానికి పెట్టింది.

1970లో స్టీవ్‌జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ కలిసి ఒక కంప్యూటర్‌ని రూపొందించారు. దీనికి వాళ్లు ఆపిల్ -1 అని పేరు పెట్టారు. ఇలాంటివి కేవలం 200 మాత్రమే తయారుచేశారు. ఇప్పుడున్న ఆపిల్ ఐపాడ్‌ల కన్నా ఈ కంప్యూటర్ వెయ్యి రెట్లు నిదానంగా పనిచేస్తుంది. అప్పట్లో పూర్తిగా అసెంబుల్డ్ మదర్‌బోర్డ్‌తో తయారైన కంప్యూటర్. ఈ కంప్యూటర్ కొనడానికి ఎక్కువమంది పోటీపడే అవకాశం ఉందని ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. 1977లో దీని తయారీ ఆపేశారు. అప్పటివరకు దీని రేటు 666.66 అమెరికన్ డాలర్లు. ఇప్పుడు వేలానికి వేస్తే కనీసం 3లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో రెండు కోట్లకు పైగానే పలుకుతుందని ఆశిస్తున్నారు. దీన్ని సెప్టెంబర్‌లో ఆర్‌ఆర్ ఆక్షన్ సంస్థ వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. మరి దీన్ని ఎవరు సొంతం చేసుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!