ఓపెన్ ఎయిర్ జిమ్!

జిమ్ అంటే నాలుగు గోడల మధ్య ఉంటుంది. అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు ఏసీ, మ్యూజికల్ జిమ్స్ కూడా వచ్చాయి. మరి ఈ ఓపెన్ జిమ్ ఏంటి? ఎక్కడ ఉన్నది?

సముద్రపు అలల శబ్దానికి, తీర ప్రాంతంలో బహిరంగంగా జిమ్ చేస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోవడానికి భలే అనిపిస్తుంది కదూ! ఈ ఊహను నిజం చేశారు. కేరళలోని కన్నూర్ జిల్లాలో దేశంలోనే తొలి ఓపెన్ జిమ్‌ను స్థాపించాడు అక్కడి కలెక్టర్ మీర్ మహ్మద్ అలీ. కన్నూర్ జిల్లాలోని పయ్యంబలం బీచ్‌లో ఓపెన్ ఎయిర్ జిమ్ 150 మీటర్లలో ఉంటుంది. దీంట్లో పెద్దలకు, పిల్లలకు ప్రత్యేకంగా రెండు విభాగాలున్నాయి. చిన్న రాక్ క్లయింబింగ్ వాల్ కూడా ఏర్పాటు చేశారు. సాధారణంగా సముద్ర తీరంలో కూర్చుంటే హాయిగా అనిపిస్తుంది. అలాంటి ప్రశాంతతనిచ్చే తీరంలో జిమ్ ఏర్పాటు చేశారు. ఇలాంటి ఓపెన్ జిమ్‌లు హైదరాబాద్‌లోని పలు పార్కుల్లో ఏర్పాటు చేశారు. కానీ దానికి, దీనికి తేడా ఉంది. ఈ ఓపెన్ ఎయిర్ జిమ్‌కు ద యాంపీబియన్ అని పేరు పెట్టారు.