ఒత్తిడితో బాధ పడుతున్నారా?

మారిన జీవనశైలితో ఒత్తిడి సమస్యగా మారింది. అయితే, ఒత్తిడి కారణంగా చాలామంది అనారోగ్యం పాలవుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో ఒత్తిడిని మాయం చేసేందుకు ఫిష్ అక్వేరియం కూడా ఓ మార్గమని అంటున్నారు సైకాలజిస్టులు.

టెన్షన్‌ను తగ్గించేందుకు ఉపకరిస్తున్న చిట్కాలపై జరిగిన ఓ సర్వేలో ఫిష్ అక్వేరియం కూడా ఉందట. పలు అంశాలపై అధ్యయనం చేయగా టాప్ టెన్‌లో ఫిష్ అక్వేరియం నిలిచిందని ప్రముఖ సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. ఫిష్ అక్వేరియం వల్ల టెన్షన్ తగ్గడం మాత్రమే కాదు హై బీపీ, నిద్ర లేమి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చునని అంటున్నారు. ఫిష్ అక్వేరియంలను చూస్తూ కూర్చోవడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందట. వాటిల్లో ఉండే రంగురంగు చేపలు అటూ, ఇటూ చలాకీగా తిరుగుతున్నప్పుడు చూపు, మనసు వాటిపై కేంద్రీకరిస్తాం. ఆ సమయంలో ఒత్తిడి తగ్గిపోయి, రక్త ప్రసరణ మంచిగా జరుగుతుందని సైకాలజిస్టులు అంటున్నారు. చేపలను తదేకంగా చూడడం వల్ల హిప్నోసిస్ ప్రభావం కనిపించి ఒంట్లో ఉన్న టెన్షన్ పరార్ అవుతుంది. గర్భిణులు, వృద్ధులు, చిన్నారులకు సైతం అక్వేరియాలు ఉత్తేజం కలుగజేస్తాయి. అప్పుడప్పుడు సరదాగా చేపలు పట్టే అలవాటు ఉన్న వారినీ, ఇతర అలవాట్లు ఉన్నవారినీ పోల్చి చూస్తే.. చేపలు పట్టే వారే ఆరోగ్యంగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది.

Related Stories: