ఒంటికి మేలుచేసే ఫైబర్

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఫైబర్ కీలకపాత్ర పోషిస్తుంది. పేగుల్లో సమస్యలు నివారించడానికి, జీర్ణవ్యవస్థ మెరుగుపర్చడానికి పీచు పదార్థాలు ఎంతో అవసరం. ఫైబర్ ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో ఈవారం తెలుసుకుందాం. -ఫైబర్‌లో రెండు రకాలున్నాయి. ఒకటి కరిగే ఫైబర్, కరగని ఫైబర్. -కరిగే ఫైబర్‌లో ఓట్స్, ఓట్స్ తవుడు, బార్లీ, బ్రౌన్ రైస్, చిక్కుడు, పండ్లు, కూరగాయలు ఉంటాయి. -కరగని ఫైబర్‌లో తొక్కతీయని ధాన్యాలు, తృణధాన్యాల పొట్టు, గోధుమ పొట్టు, జొన్నపొట్టు, పండ్లు-కాయల తొక్కలు ఉంటాయి. -పేగు సంబంధిత సమస్యలకు ఫైబర్ చక్కటి పరిష్కారం. -పెద్దపేగు, చిన్నపేగుల్లో ఆహారం మంచిగా జీర్ణం అయ్యేందుకు పీచు పదార్థాలు గొప్పగా సహాయపడుతాయి. -డైటరీ ఫైబర్ ద్వారా మలబద్దక సమస్య పరిష్కారమవుతుంది. -ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల నీరు ఎక్కువగా తాగుతారు. దీంతో శరీరానికి సరిపడా నీరు అందుతుంది. -ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తింటే రక్తంలో కొవ్వు శాతం తగ్గుతుంది. -గుండె సంబంధిత సమస్యలున్నవారు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. -కరిగే ఫైబర్, కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణమవడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ పెరుగుదలను తగ్గిస్తాయి. -మధుమేహం ఉన్నవారు కరిగే ఫైబర్ పదార్థాలు తీసుకోవడం ఉత్తమం. -బరువు తగ్గేందుకు ఫైబర్ ఫుడ్ చక్కటి పరిష్కారం. ఫైబర్ అధికంగా ఉండే ఆహారంలో శక్తి సాంద్రత తక్కువగా ఉంటుంది. -కడుపు ఉబ్బరంగా ఉండడం వల్ల మళ్లీ ఏమీ తినాలనిపించదు. -ఫైబర్ ఉన్న పదార్థాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి, ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. -ఊబకాయాన్ని, మధుమేహాన్ని అరికట్టడంలో ఫైబర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. -డాక్టర్ మయూరి ఆవుల న్యూట్రిషియనిస్ట్ mayuri.trudiet@gmail.com

Related Stories: