ఎలా నిద్రించాలంటే?

నిద్రపోయేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల సుఖంగా నిద్ర పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎటువైపు తిరిగి పడుకుంటేనేమి... అనుకునేవాళు మాత్రం ఇవి తెలుసుకోవాల్సిందే! ఎడమవైపు తిరిగి నిద్రించడం వల్ల తీసుకున్న ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది. ఎడమవైపు పడుకుంటే గ్యాస్,ఎసిడిటి, హార్ట్ బర్న్ వంటి సమస్యలు తగ్గుతాయట. బ్యాక్ పెయిన్ ఉన్న వారికి ఎడమవైపు నిద్రించడం వల్ల కొంత మేర ఉపశమనం కలుగుతుంది. రక్త ప్రసరణ సరిగా జరిగి, గుండెకు ఎటువంటి భారం లేకుండా ఉంటుంది. కుడివైపు, ఎడమవైపు నిద్రించేవాళ్లపై సర్వే నిర్వహించగా, కుడి వైపు నిద్రించిన వారికి అశాంతి, తక్కువ నిద్రతో బాధపడినట్లు వెల్లడైంది. ఎడమ వైపు నిద్రించే వారిలో గాఢ నిద్ర,మానసిక ప్రశాంతత, ఉల్లాసం వంటివి కనిపించాయట. ముఖ్యంగా గురక సమస్య ఉన్నవారు ఎడమవైపు తిరిగి పడుకుంటే మంచి పరిష్కారం లభించినట్లే. గర్భిణులకు మరింత మేలు జరుగుతుందట. కడుపులో ఉన్న శిశువుకి రక్త ప్రసరణ జరిగి ఆరోగ్యంగా ఉంటుందట. కొవ్వు పదార్థాలు సులభంగా జీర్ణమవుతాయి. పార్కిన్సన్, అల్జీమర్స్ వ్యాధులను దూరంగా ఉంచొచ్చు.

Related Stories: