ఎందుకంటే?

హిందూమత వ్యవహారాలన్నీ ఆగమ- నిగమాల ఆధారంగానే పనిచేస్తాయి. ఆగమం అంటే మంత్ర శాస్ర్తాలు. నిగమం అంటే వేదం. ఈ రెండింటికీ శబ్దార్థాలలో ఏకత్వం ఉంటుంది. దీని పరమార్థం పరమేశ్వరుని నుండి వెలువడింది అని. దేవతల ఉపాసనలు, ఆలయ నిర్మాణాలు, విధులు వంటివన్నీ ఆగమాలలో విస్తృతంగా ఉన్నాయి. వాటి ఆధారంగానే మన దేవాలయాల కార్యకలాపాలు నిర్వర్తింపబడుతున్నాయి. నిజానికి వీటి మూలాలు వేదాలలోనే ఉన్నాయి. మనకు నాలుగు వేదాలు (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం) ఉన్నాయి. వాటి ప్రకారం నిగమ శాస్ర్తాలు వాడుకంలోకి వచ్చాయి. యజ్ఞభూముల నిర్మాణం, దేవతారాధన వేదాలలోనివే. వాటిని మధించి ఋషులు దర్శించినివే ఆగమాలు.