ఎందుకంటే?

జంధ్యాల పూర్ణిమనాడు యజ్ఞోపవీతాన్ని ఎందుకు మారుస్తారు?- ఇది చాలా లోతైన ప్రశ్న. మనకు తెలియకుండానే అనేక ప్రత్యక్ష-పరోక్ష అపవిత్ర చర్యల బారిన పడుతుంటాం. ఎలాంటి విఘాతాలు (అపవిత్రాలు) రానంత వరకు జంధ్యం శక్తి ఏడాది పాటు కొనసాగుతుంది. తర్వాత దాని కాలపరిమితి ముగుస్తుంది. కాబట్టి, జంధ్యాల పూర్ణిమ సందర్భంగా నూతన జంధ్యాన్ని శాస్ర్తోక్తంగా అర్చించి గాయత్రీదేవి, సూర్యభగవానుల శక్తులను అందులోకి ఆవాహన పరచుకోవాల్సి ఉంటుంది. అలా ధరించే కొత్త యజ్ఞోపవీతంతో మళ్లీ అంతటి శక్తి మన సొంతమవుతుంది.