ఎంఎన్‌ఆర్‌ఈలో సైంటిస్టులు

న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-పోస్టు పేరు: సైంటిస్ట్ -మొత్తం పోస్టులు: 9 -అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టు/బ్రాంచీల్లో బీఈ/బీటెక్ లేదా మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. గేట్ -2018లో అర్హత సాధించాలి. -వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. -ఎంపిక: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ -దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో -చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (సెప్టెంబర్ 8-14)లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి. -వెబ్‌సైట్: https://mnre.gov.in