ఈఎస్‌ఐసీలో 529 ఖాళీలు

న్యూఢిల్లీలోని భారత కార్మిక మంత్రిత్వశాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) ఖాళీగా ఉన్న ఎస్‌ఎస్‌వో/ మేనేజర్ / సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. -పోస్టు పేరు: సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్/ గ్రేడ్2 మేనేజర్ / సూపరింటెండెంట్ -మొత్తం పోస్టులు: 529 (జనరల్-294, ఓబీసీ-141, ఎస్సీ-82, ఎస్టీ-22) గమనిక: ఈఎస్‌ఐసీ 2014 జనవరి 6న విడుదల చేసిన ప్రకటనకు అనుగుణంగా తాజా నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు దరఖాస్తు చేసుకున్నవారు ప్రస్తుతం ఫీజు చెల్లించనవసరం లేదు. -అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. కామర్స్/లా/మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. ప్రభుత్వ సంస్థ/కార్పొరేషన్ /లోకల్ బాడీ/షెడ్యూల్డ్ బ్యాంక్‌లలో మూడేండ్ల పాటు పనిచేసి ఉండటం అభిలషణీయం. -వయస్సు: 2018 అక్టోబర్ 5 నాటికి 21 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. -పే స్కేల్: రూ. 44,900/- (7వ వేతన పే స్కేల్ అనుసరించి) -అప్లికేషన్ ఫీజు: రూ. 500/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు రూ. 250/-) -ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ద్వారా -ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, రీజనింగ్ ఎబిలిటీ-35, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-35 అంశాల నుంచి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. -సమయం: 60 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి. -మెయిన్ ఎగ్జామినేషన్‌లో రీజనింగ్/ఇంటెలిజెన్స్-40, జనరల్/ఎకానమీ/ఫైనాన్షియల్/ ఇన్సూరెన్స్ అవేర్‌నెస్-40, ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-40 అంశాల నుంచి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు /ఒకటిన్నర మార్కు చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. 120 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి. -కంప్యూటర్ స్కిల్ టెస్ట్‌లో పవర్‌పాయింట్స్ ైస్లెడ్స్-10, ఎంఎస్ వర్డ్-20, ఎంఎస్ ఎక్సెల్-20 మార్కులు డిస్క్రిప్టివ్ టెస్ట్ (రెండు ప్రశ్నలు)-50 మార్కులకు ఉంటుంది. -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: అక్టోబర్ 5 -వెబ్‌సైట్: www.esic.nic.in

Related Stories: