ఇలా చేద్దాం

క్యూ పద్ధతి అంటేనే ఒకరి తర్వాత ఒకరుగా వెళ్లడం. ప్రత్యేకించి గుళ్లల్లో, ఇంకా తిరుపతి వంటి ప్రఖ్యాత దేవస్థానాలలో, ఇంకా మరెక్కడైనా (సినిమా టిక్కెట్ల కోసమైతే చెప్పనక్కర్లేదు) సరే, ఒకరిద్దరికి మించి గుంపులు (క్యూలు)గా వెళ్లేచోట చాలామంది ఒకరి నొకరు వెనుక నుంచి నెట్టుకుంటూ త్వరత్వరగా ముందుకు సాగాలని తొందర పడుతుంటారు. ఇది అవసరమా? ఓపిగ్గా వ్యవహరిస్తూ మంచి భక్తులం, మంచి పౌరులం అనిపించుకోలేమా? తద్వారా వృద్ధులు, పిల్లలు, మహిళలకు, ఇంకా ఆ మాటకొస్తే ప్రతి ఒక్కరికీ ఇబ్బంది కలక్కుండా వ్యవహరించిన వాళ్లమవుతాం కదా.