ఇలా చేద్దాం

ఈ ఆదివారం రాఖీ పండుగ. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఒక ప్రతీక. నీకు నేనున్నానమ్మా అని ప్రతి సోదరుడూ తన రక్తం పంచుకొని పుట్టిన ఆడబిడ్డకు ఇచ్చే తిరుగులేని భరోసా. ఆమెకు అదొక్కటి చాలు, జీవితాంతం పుట్టింటిపై ప్రేమవర్షం కురిపించడానికి! మన భారతీయ సంస్కృతిలోని ఉత్తమ ఆచారాలలో ఒకటైన ఈ రక్షాబంధనం వేళ.. తోడబుట్టిన వాళ్లమంతా ఆత్మీయతను పంచుకొందాం. మిగిలిన రోజులలో ఎవరి కుటుంబాలతో వారున్నా ఈ ఒక్కరోజైనా ఆ అపురూప క్షణాల్ని మనసారా కలిసిమెలసి ఆస్వాదిద్దాం. ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు, ఒక్క ప్రేమైక జీవితం తప్ప అని తోటివారికి చాటిచెబుదాం.