బలగం కాదు బలమే కాపాడుతుంది

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. శ్రీను వైట్ల దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్నారు. ఇలియానా కథానాయిక. సోమవారం చిత్రబృందం టీజర్‌ను విడుదలచేసింది. ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మనచుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉన్న బలం అంటూ టీజర్‌లో రవితేజ చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంటున్నది. వాడు ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో, ఎలా వస్తాడో ఎవరికీ తెలియదు అంటూ రవితేజ గురించి విలన్ పాత్రధారులు చెబుతున్న సంభాషణలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ టీజర్‌లో మూడు పాత్రల్లో విభిన్నంగా కనిపించారు రవితేజ. నవ్యమైన కథ, కథనాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అమెరికాలోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. నవంబర్ 16న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని చిత్రబృందం తెలిపింది. సునీల్, లయ, వెన్నెల కిషోర్, తరుణ్ అరోరా, అభిమన్యుసింగ్, విక్రమ్‌జిత్, రాజ్‌వీర్‌సింగ్, షాయాజీషిండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్, సంగీతం: తమన్, సహనిర్మాత: ప్రవీణ్ మర్పూరి, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీనువైట్ల.